వియత్నాంలో యాగి తుపాను కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో మృతుల సంఖ్య 197కు పెరిగింది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 800 మందికి పైగా గాయపడ్డారని.. 125 మందికి పైగా ఆచూకీ ఇంకా దొరకలేదని అక్కడి మీడియా పేర్కొంది.
ఉత్తర వియత్నాంలోని లావో కై ప్రావిన్స్‌లోని లాంగ్‌ను కుగ్రామం వరదలకు కొట్టుకుపోయిన ఘటనలో తాజాగా ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి.