మంత్రి లోకేశ్‌ను కలసి పలువురు దాతలు విరాళాల చెక్కులు అందజేశారు. విజయవాడకు చెందిన ప్రియ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ సంస్థ అధినేత పీ శివకుమార్ రూ.10 లక్షలు, పలమనేరుకు చెందిన బీ సునీల్ రూ.10 లక్షలు, కాకినాడ సత్య స్కాన్స్ అండ్ డయాగ్నస్టిక్స్ అధినేత డాక్టర్ కాడ వెంకట రమణ రూ.5 లక్షలు, మంగళగిరి వైసీపీ నేత, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు, బద్వేలుకు చెందిన చెరుకూరి రవికుమార్, కడపకు చెందిన తేరకండ్ల కృష్ణారెడ్డి, కురుపాంకు చెందిన వైరిచర్ల విరేష్ చంద్రదేవ్, విశాఖ ఐవీవై ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ అధినేత బీ రామ్‌కుమార్ రూ. ఐదేసి లక్షలు, తిరుపతికి చెందిన శ్రీగీతాంజలి ఇంగ్లీష్ మీడియా స్కూల్ యజమాని ఎన్ మాధవి రూ.2 లక్షలు, కందుకూరు ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.లక్షన్నర, చింతలపూడికి చెందిన మద్దిపూడి శ్రీనివాసరావు చౌదరి రూ.1,35,136, తిరుపతి సప్తగిరి బ్యాంక్ రిటైర్డ్ స్టాఫ్ రూ.1,16,700 విజయవాడకు చెందిన బొర్రా రాధాకృష్ణ రూ.లక్ష, అమలాపురానికి చెందిన మెట్ల రమణబాబు రూ.లక్ష అందజేశారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు రూ.1.5 కోట్ల విలువ చేసే 10,000 నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను పంపించినట్టు అక్షయపాత్ర ఫౌండేషన్ ఏపీ సెంట్రల్ రీజియన్ అధ్యక్షుడు వంశీధర దాస తెలిపారు.