కుందుర్పి మండలం తూమకుంట గ్రామానికి చెందిన జగదీష్ ఆయన భార్య రోజా, వారి బంధువులపై శుక్రవారం రాత్రి టిడిపి శ్రేణులు దాడి చేశారు. దాడిలో జగదీష్, రోజాలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి భాదితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడకండి, అండగా ఉంటామని భరోసానిచ్చారు.