ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆది కవి నన్నయ్యకి తెలుగులో ప్రత్యేక స్థానం ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 11:48 PM

 తెలుగు సాహిత్య చరిత్రలోనే రచయిత్రి మొల్లమాంబకు ప్రత్యేక స్థానం ఉందని ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మెుల్ల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, మైసూర్‌ మహారాజు, ఎంపీ, యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.." తెలుగు జాతికి మెుల్ల ఓ విలువైన రత్నం. ఆది కవి నన్నయ్య అయితే ఆది కవయిత్రి మొల్ల. మెుదటి తెలుగు కవియిత్రిగా తెలుగువారి గుండెల్లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. ఆరు కాండాలు, 871పద్యాలతో రామాయణాన్ని కేవలం ఐదు రోజుల్లో రచించడం ఆమె విజ్ఞానానికి నిదర్శనం. సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో ఆమె అనువాదం ఉంటుంది. మెుల్లను ఆదర్శంగా తీసుకుని విద్యార్థినిలు ముందుకెళ్లాలి. ఆమె స్ఫూర్తితో ఉన్నత చదువులు చదివి దేశానికి కీర్తి తీసుకురావాలి. తెలుగు భాష గొప్పతనాన్ని భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ సంకల్పించాలి. మాతృభాషలో చదువుకున్నప్పుడే అన్నీ అంశాలపై అవగాహన పెరుగుతుంది. చేతి, కుల వృత్తులను కాపాడుకోవాలి" అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com