ఉత్తరప్రదేశ్ లోని కాస్గంజ్ జిల్లాలో ఆదివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడం కోసం ఓ యువకుడు నడిరోడ్డుపై శవంలా పడుకుని.. చనిపోయినట్లు నటించాడు. చాలా సేపు పడుకుని ఒక్కసారిగా పైకి లేచాడు.
రోడ్డుపై వెళ్తున్న బాటసారులు అతన్ని చూసి షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు సదరు యుకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.