మనకు తెలిసినంత వరకు ఖరీదైన బియ్యం కిలో ధర రూ.100 నుంచి రూ.250 వరకు ఉంటుంది. అయితే జపాన్‌కు చెందిన కిన్మెమై రైస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించింది.
ఈ బియ్యం ధర కిలో రూ.15,000 పలుకుతోంది. వంట చేయడానికి ముందు కడగడం అవసరం లేదు. అవి ఉడికించడం సులభం. ఈ బియ్యానికి తక్కువ నీరు అవసరం పడుతుంది. విత్తిన తర్వాత 105 నుంచి 150 రోజులలో కోత కోయొచ్చు.