విజయవాడ వరదలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో అంత పెద్ద వరద వచ్చాక పది రోజుల్లో మళ్లీ నార్మల్ స్థాయికి తేవటం కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు వల్లే సాధ్యం అయ్యిందన్నారు. ‘‘ఇది నేను కాదు.. వరదల్లో ఇబ్బందులు పడ్డ ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారు’’ అని అన్నారు.