ఆర్డీవోగా పనిచేసిన హేమలత సేవలు చిరస్మరణీయమని పార్వతీపురం కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. బదిలీపై వెళుతున్న ఆమెకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో బాధ్యతలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ శోభిక, పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్వో జి.కేశవనాయుడు, జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa