భారత్‌లో ఎక్కువగా మగవాళ్ల ఆధిపత్యం కనిపిస్తూ ఉంటుంది. కానీ మేఘాలయ రాష్ట్రంలో మాత్రం ప్రజలు ఇంకా మాతృస్వామ్య విధానం పాటిస్తున్నారు. దీంతో అక్కడ పెళ్లి తర్వాత మగవాళ్లే పుట్టింటిని వదిలి అత్తారింటికి వెళ్తారు.
అక్కడే నివసిస్తారు. అలాగే వంశపారంపర్యంగా తల్లి ఇంటిపేరే పిల్లలకు వర్తిస్తుంది. అక్కడ వరకట్న వ్యవస్థ లేదు. సహజీవనాన్ని కూడా అక్కడి సమాజం అంగీకరిస్తుంది. అక్కడ వ్యాపారాలన్నీ మహిళలే నడిపిస్తుంటారు. తాతల ఆస్తి అక్కడ చిన్న కూతురుకు చెందుతుందని సమాచారం.