కళ్యాణదుర్గం బీటీపీ ప్రాజెక్టును సందర్శించడానికి ఆదివారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వచ్చారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మంత్రి నిమ్మల రామానాయుడుకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి ప్రాజెక్టు సందర్శించడానికి వెళ్లారు. జీవనాడి అయిన బీటీపీ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రికి ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు.