కేంద్రమంత్రి అమిత్ షా వామపక్ష శత్రువులను లేకుండా చేస్తున్నారని.. అమిత్ షా క్రిమినల్ అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సైద్థాంతిక వ్యవస్థను నాశనం చేయడానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కత్తితో రాజకీయం చేస్తే కత్తితోనే పోతారని హెచ్చరించారు. లోపాల్ని ఎత్తి చూపేవారిని చంపేయడం సరైంది కాదన్నారు. మోడీకి వ్యక్తిగతమైన పలుకుబడి తగ్గిందన్నారు. నైతికంగా మోడీ ఓడిపోయారన్నారు.
మోదీని కొనసాగించకూడదని ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. బీజేపీ హయాంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. మోదీ విదేశాలకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నిస్తూ.. భారతదేశానికి మోడీ ఛీప్ గెస్ట్ ప్రధానిగా మారారని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్న తమిళనాడు గవర్నర్‌ను రీకాల్ చేయాలన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు ముందుగా పరిష్కరించాలని నారాయణ డిమాండ్ చేశారు.