రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని, త్వరలో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి చరమగీతం పాడనున్నారని అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమరనాథ రెడ్డి అన్నారు. వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు శనివారం ఒంటిమిట్ట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన తిరుమల లడ్డును రాజకీయం చేసి లబ్ధి కోసం పాటు పడుతున్నారని ఆయన విమర్శించారు.