తిరుమల లడ్డు వివాదంపై వైయస్ఆర్సీపీ కోర్టుకు వెళ్లడంతో భయపడిన సీఎం చంద్రబాబు సిట్ వేశారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. లడ్డూపై తాను తప్పుడు ఆరోపణలు చేయలేదని అనుకుంటే సుప్రీం కోర్టు విచారణను కోరుతూ చంద్రబాబు ప్రభుత్వమే అఫిడవిట్ వేయాల్సిందన్నారు.
ఆధారాలు, ధైర్యం లేదు కాబట్టే సిట్ విచారణ అని అంటున్నారు. ముందుగా విచారణ చేపట్టామని చెప్పుకునేందుకే సిట్ వేశారు. లడ్డూ వివాదంపై వైయస్ఆర్సీపీ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో చంద్రబాబు బయపడ్డారు. లడ్డూపై చంద్రబాబు చెప్పింది నిజమైతే సుప్రీంకోర్టు విచారణను కోరాల్సిందని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.