ప్రపంచ దేశాల్లోని ఆయిదు ఉత్తమ రాజధానుల్లో అమరావతిని నిలపలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 2014లో టీడీపీ హయాంలో 9 లక్షల గృహాలు మంజూరు చేశామని... ఇది దేశంలోనే రికార్డు అని తెలిపారు. టిడ్కో గృహాలను నిర్మించిన కాంట్రాక్టర్లకు జగనన్న ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని అన్నారు. ఆ కాంట్రాక్టర్లు ఇప్పుడు బిల్లుల కోసం తిరుగుతున్నారని చెప్పారు. టిడ్కో గృహాల సముదాయంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రోజుకు రెండు లక్షలకు పైగా ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ వద్ద పేదలు భోజనం చేస్తున్నారని చెప్పారు. అన్న క్యాంటీన్లను జగన్ ఎందుకు మూసివేశారో సమాధానం చెప్పాలని అన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని.. సీఎం చంద్రబాబు తన చాకచక్యంతో సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు.