ఏపీటీఎఫ్ ఆవిర్భవించి 80సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అక్టోబర్ 6, 7, 8తేదీల్లో విజయనగరంలో జరిగే ఓక్ జూబ్లీ వేడుకలు, 20వ రాష్ట్ర విద్య, వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మధుసూదనరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు సాంబశివుడు, జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మాధవస్వామి,నగిరి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
ఆదివారం నంద్యాలలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యలయంలో రాష్ట్ర మహాసభల గోడపత్రికలను వారు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ విద్యాప్రగతి, ఉపాధ్యాయ సంక్షేమం, సమాజ శ్రేయస్సు, పింఛన్లు, నూతన జాతీయ విద్యావిధానం-2020, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై అనుసరిస్తున్న విధానాలపై చర్చించి తీర్మానాలు చేసి ప్రభుత్వాలకు పంపుతామన్నారు. కార్యక్రమంలో పుల్లయ్య, మునిస్వామి, పవనకుమార్, గోపాల్‌రావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.