చీరాల పట్టణంలోని రామ్ నగర్ లో డీఎస్పీ జగదీశ్ నాయక్ ఆధ్వర్యంలో సీఐలు భూషణం, శ్రీనివాసరావు, శేషగిరిరావులు 130 మంది పోలీసు సిబ్బందితో సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సారా తయారికీ ఉపయోగించే 2వేల లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. 30 లీటర్ల సారాతో పాటు సరైన పత్రాలులేని 30 బైక్ లు, 3 అటోలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని డీఎస్పీ హెచ్చరించారు.