పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు నిజం లేదు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పచ్చి అబద్ధాలు వల్లె వేసి తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రతిష్టను సీఎం చంద్రబాబు అబాసుపాలు చేశారు. పరమ పవిత్రమైన లడ్డూ విశిష్టతకు దెబ్బతీశారు. శ్రీవారి ప్రసాదం బాగాలేదని, తింటే మంచిది కాదని భక్తుల్లో అనుమానపు బీజాలు నాటారు. తాను చెబుతున్నది పచ్చి అబద్ధమని తెలిసి కూడా చంద్రబాబు పదే పదే అవాస్తవాలు చెబుతున్నారు. నేడు సుప్రీం కోర్టు సైతం స్పందిస్తూ.... ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ప్రపంచంలోని భక్తులందరి మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యాఖ్యలతో వాళ్ల మనోభావాలు దెబ్బతీశారు. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి. భగవంతుని రాజకీయాల్లోకి లాగొద్దు. ఈ అంశంపై నేరుగా మీరు మీడియాకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా.సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలి. సీఎం వ్యాఖ్యలతో కోట్లాదిమంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు గాయపడ్డాయి అని వ్యాఖ్యానించింది.