నరసన్నపేట, జడూరు జంక్షన్ వద్ద హైవేపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలాకి మండలం రేగుపాడుకు చెందిన ఎస్.రామయ్య (65) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖ నుంచి టెక్కలి వైపు వెళ్తున్న కారు రోడ్డు దాటుతున్న రామయ్యను ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ దుర్గాప్రసాద్ ఘటనా ప్రదేశాన్ని పరిశీలించి మృతదేహం పోలాకి పరిధిలో ఉండడంతో ఆ మండల పోలీసులకు సమాచారం అందించారు. పోలాకి పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.