ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుుడుపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు. దేశ రాజకీయం చంద్రబాబు చేతిలో ఉందని తెలిపారు. 50 ఏళ్ల నుంచి చంద్రబాబు తనకు తెలుసునని అన్నారు. చంద్రబాబుకు ఉన్న లక్ ఎవరికీ లేదని అన్నారు. చంద్రబాబు చాలా అదృష్టవంతుడని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చంద్రబాబు మాట్లాడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపవచ్చని అన్నారు. విశాఖపట్నంలో చింతామోహన్ ఇవాళ(శుక్రవారం) పర్యటించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ... తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం..రాజకీయాల్లోకి తీసుకు రావడం మంచిది కాదని అన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని..నెయ్యి స్థానంలో పామాయిల్ కానీ, వంటనూనె కలిపి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.
తిరుపతి లడ్డూ మీద సీఎం చంద్రబాబు మాట్లాడకూడదని అన్నారు. ధర్మాసనాలు చూడాల్సిన పని రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పారు. చంద్రబాబు సూపర్ 6 అన్నారని..ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఏపీ అంటే అమరావతి.. పోలవరం అని చంద్రబాబు అంటున్నారని అన్నారు.