ఇంద్రకీలాద్రిపై దేవీనవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజుకి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు చేరుకున్నాయి. ఈరోజు శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు.
పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవిని దర్శించుకుని భక్తులు తరిస్తారు. మరోవైపు దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వీఐపీలు కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు.