గాయత్రీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని ఎంపీ కేశినేని చిన్ని నేడు దర్శించుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ దసరా ఉత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవని చెప్పారు.
సామాన్య భక్తులందరికీ అమ్మవారి దర్శనం కలిగే విధంగా సీఎం చంద్రబాబు ఆదేశాలు, సూచనలతో దేవాదాయశాఖ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందన్నారు. వీఐపీల కోసం ప్రత్యేకమైన యాప్‌ను క్రియేట్ చేశామన్నారు. ఈ యాప్ ద్వారా వీఐపీలు దర్శించుకునే విధంగా టైం స్లాట్‌ను ఏర్పాటు చేశారని.. సామాన్య భక్తులకు పెద్దపీఠం వేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.