టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు విశ్వవిజేతగా నిలిచి, దేశమంతటా పండగ వాతావరణాన్ని నింపింది. ఈ గెలుపు కేవలం ఆటగాళ్లకు, అభిమానులకే కాదు, ఐసీసీతో పాటు ప్రకటనకర్తలకు కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. తాజా నివేదికల ప్రకారం ఈ మెగా టోర్నీ ద్వారా కేవలం అడ్వర్టైజ్‌మెంట్ల రూపంలోనే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్, ఫైనల్ పోరు ఈ కనకవర్షానికి ప్రధాన కారణమయ్యాయి. ఎక్స్ఛేంజ్ ఫర్ మీడియా నివేదిక ప్రకారం ఈ వరల్డ్ కప్‌లో కేవలం ప్రకటనల ద్వారానే సుమారు రూ.1500 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. టోర్నీ ప్రారంభంలో అంచనాలు తక్కువగా ఉన్నప్పటికీ, భారత్ వరుస విజయాలతో దూసుకుపోవడంతో బ్రాండ్లన్నీ క్యూ కట్టాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa