గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట జెండాచెట్టు సమీపంలో 30 ఏళ్లకు పైగా కొనసాగుతున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిని రైతు బజార్ ఎదురుగా నూతన భవనంలోకి మార్చారు. ఈ నూతన బ్రాంచిని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ బంగార్రాజు, బ్రాంచ్ మేనేజర్ కిషన్ తో పాటు DSP జనార్ధనరావు, కమిషనర్ రామ అప్పలనాయుడు, కొత్త సుబ్రహ్మణ్యం, మునగాల మోహన శ్యామ్ ప్రసాద్, DL కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ మార్పుతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa