ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళ లోదుస్తులు దొంగిలిస్తూ దొరికిపోయిన యువకుడు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 06:08 PM

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో తన పొరుగునే ఉండే మహిళపై మనసు పారేసుకున్న ఓ యువకుడు.. ఆమెకు చెందిన లోదుస్తులను దొంగిలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. సీసీటీవీ కెమెరా పుణ్యమా అని నిందితుడి అసలు రంగు బయటపడటంతో.. చిమన్‌గంజ్ మండి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.


ఇండోర్‌లోని చిమన్‌గంజ్ మండి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో నివసించే మహిళ.. తన ఇంటి బయట ఆరవేసిన బట్టలలో కేవలం లోదుస్తులు మాత్రమే పదేపదే మాయమవడాన్ని గమనించింది. ఎవరో కావాలనే ఈ పని చేస్తున్నారని అనుమానించిన కుటుంబ సభ్యులు.. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ దృశ్యాలను తనిఖీ చేశారు. అప్పుడే ఓ దృశ్యం చూసి వారు షాక్‌కు గురయ్యారు. ఎందుకుంటే.. అదే ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల అమిత్ మాల్వియా అనే యువకుడు.. మెల్లగా బట్టలు ఆరవేసిన వైరు వద్దకు వచ్చి, మిగిలిన బట్టలను ముట్టుకోకుండా కేవలం మహిళకు సంబంధించిన లోదుస్తులను మాత్రమే దొంగిలించాడు. ముఖ్యంగా దొంగిలించిన ఇన్నర్స్‌ను అతడు తన జీన్స్ ప్యాంట్ జేబులో వేసుకుని అక్కడి నుంచి మెళ్లిగా జారుకోవడం స్పష్టంగా కనిపించింది.


 దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఆధారంగా నిందితుడు అమిత్ మాల్వియాను అదుపులోకి తీసుకున్నారు. ఆపై విచారించగా.. అతడు చెప్పిన కారణాలు విని పోలీసులే షాక్ అయ్యారు. తాను ఆ మహిళను గాఢంగా ప్రేమిస్తున్నానని.. అందుకే ఆమె వస్తువులను తన వద్ద ఉంచుకోవాలని అనుకుని దొంగతనానికి పాల్పడినట్లు చెప్పాడు. అంతటితో ఆగకుండా.. తన ప్రేమకు నిరూపణగా ఆమె పేరును తన గుండెపై టాటూ వేయించుకున్నానని కూడా చూపించాడు.


కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు..


చిమన్‌గంజ్ మండి స్టేషన్ ఇన్‌ఛార్జ్ గజేంద్ర పచౌరి మాట్లాడుతూ.. నిందితుడు వన్ సైడ్ లవ్ పేరుతో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. మహిళల భద్రతకు భంగం కలిగించేలా ఎవరు ఇలా ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు ప్రేమ పేరుతో ఇలాంటి పాడు పనులకు పాల్పడటం మానసిక వైకల్యానికి సంకేతమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa