పెనుకొండ మండల కేంద్రంలో ఈనెల 7వ తేదీ ప్రజా దర్బార్ వేదిక నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 7న ప్రజా దర్బార్ (సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.
నియోజకవర్గ ప్రజానీకం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే మంత్రి దృష్టికి తీసుకురావాలని కోరారు.