బుడమేరు ఆక్రమణల కారణంగా విజయవాడ ముంపునకు గురైందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో పారుదల కాలువలను ఇవాళ( శనివారం) మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... 2015లో నెల్లూరు నగరంలో వచ్చిన వరదలకు మునిగిపోయిందని చెప్పారు. నెల్లూరు నగర అభివృద్ధి కోసం సమ్మూలంగా మార్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు. బుడమేరు వాగు ఉప్పెనతో ఏడు లక్షల మంది ఇబ్బందులు పడ్డారని మంత్రి నారాయణ తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలనుసారం ఆపరేషన్ బుడమేరును అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపల్ అదికారులతో నెల్లూరులో సమీక్ష నిర్వహించామని అన్నారు. పది రోజుల్లో వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చాని తెలిపారు. పది రోజుల తర్వాత కాలువల వైండింగ్ పనులు ప్రారంభిస్తామని అన్నారు. పేదలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూపించి కాలువల మరమ్మతులు చేస్తామని అన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు సహకరించాలని.. ఆక్రమణల విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరించారు.