శ్రీకాకుళం నగరంలోని ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చేరేందుకు సోమవారం, మంగళవారం ప్రవేశాల దరఖాస్తులను ఆహ్వానించినట్లు కళాశాల ప్రిన్సిపల్ సూర్యరావు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు రూ. 400 అడ్మిషన్ ఫీజుతో కళాశాలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఈ స్పాట్ అడ్మిషన్ల అనంతరం 100 అపరాధ రుసుముతో ఈనెల 9, 12వ తేదీలలో ప్రవేశాలు పొందవచ్చన్నారు.