పులివెందుల పట్టణంలోని తన స్వగృహంలో సోమవారం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.