మదనపల్లె పట్టణంలో విజయదశమి పురస్కరించుకుని పలు వీధులో దుర్గమ్మను ఏర్పాటు చేసి 9 రోజులు పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆదివారం సాయంత్రం నిమజ్జనం చేశారు. టి. నాగిరెడ్డివీధిలో దుర్గామాతకు విశేషంగా పూజలు నిర్వహించి అనంతరం ఆదివారం సాయంత్రం ఊరేగింపుగా తరలి వెళ్లి తట్టివా రిపల్లె చెరువులో నిమజ్జనం చేశారు. అలాగే కోటవీధిలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వ ర్యంలో దుర్గామాతను ఏర్పాటు చేసి విశేషంగా పూజలు నిర్వహంచి ఆదివారం అంగ రంగ వైభవంగా అమ్మవారికి పూజలు చేసి బళ్లారిడ్రమ్స్ నడుమ విజయదర్గమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి బైపాస్‌లోని స్వామి చెరువులో నిమజ్జనం చేశారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు. ఇందులో మున్సిపల్ వార్డు కౌన్సిలర్ తులసీరామకృష్ణ, విశ్వబ్రాహ్మణులు, యువత పాల్గొన్నారు. అలాగే స్థానిక కమ్మగడ్డవీధిలోని నాదేళ్ళ అరుణ్ తేజ్ ఆధ్వర్యంలో దుర్గమ్మను ప్రతిష్టించి విశేషం గా పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు యువకులు లలిత, సాయి, విఘ్నేష్, నిఖిల్, మణి, నానిలు దుర్గమ్మకు పూజలు, చేశారు. ఆదివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం దుర్గమ్మకు ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లి ఇసుకనూతనపల్లె చెరువులో నిమజ్జనం చేశారు. అంతకు ముందు లడ్డూ వేలం వేయగా కరుణాకర్, సాయిచంద్, సందీప్‌లు రూ.2,16000లకు సొంతం చేసుకున్నారు.