పరిశ్రమల స్థాపనకు భారత్లోని మరే రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో అనువైన వాతావరణాన్ని కల్పించి, ప్రోత్సహకాలిస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న లోకేశ్ మాట్లాడుతూ.. ‘స్టార్టప్ అంధ్ర’ అనేది నినాదం మాత్రమే కాదని, పరిపాలన విధానాన్ని మార్చేసే ఆయుధమని పేర్కొన్నారు. ప్రైవేటురంగ సహకారంతో 20లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించి తీరుతామని ప్రకటించారు.