భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కెనడాలోని హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.
ఆ దేశంతో దౌత్యం తగ్గించుకుంటున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. నిజ్జర్ హత్యకేసులో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితులుగా పేర్కొనడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.