ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణశాఖ, అల్పపీడనం, భారీ వర్షాల హెచ్చరికలతో ఆరు జిల్లాల్లో సహాయ, పునరావాస చర్యలపై ఫోకస్ పెట్టింది.
ఆరు జిల్లాలకు రూ.6 కోట్లను విడుదల చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు రూ.కోటి చొప్పున విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.