సామూహిక అత్యాచారానికి గురైన వలస కార్మిక కుటుంబాలకు జీవన భృతి , ఆర్థిక సహాయం కోటి రూపాయలు ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేశారు.
గురువారం పెనుగొండ పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓ టి. ఆనంద్ కుమార్ కు సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ అధ్యక్షతన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్ పాల్గొన్నారు.