ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా చంద్రబాబునాయుడు మహిళల స్వయం ఉపాధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా డ్వాక్రా మహిళలకు భారీగా రుణాలివ్వబోతున్నారు.
ఇప్పటికే ఉన్న యూనిట్లతోపాటు, కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్లకు వచ్చే నెల నుంచి రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం ఇవ్వనున్నారు. అయితే ఈసారి కేంద్రం నిధుల్ని సెర్ప్ కు అనుసంధానించి అక్కడి నుంచి రుణాలివ్వబోతున్నారు.