దుర్గి మండలంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో తాగునీరు, రహదారుల నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటుతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.