కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన సురక్షతో బీమా సౌకర్యం పొందవచ్చునని జిల్లా ఎల్. డి. యం జనార్ధన్ పేర్కొన్నారు. ఆదివారం అట్లూరు మండలంలోని కుంభగిరిలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన.
ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన, అటల్ పెన్షన్ యోజన కార్యక్రమాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. జనార్ధన్ మాట్లాడుతూ. మారుతున్న సమాజంలో ప్రతి ఒక్కరికీ బీమా అవసరం పెరిగిందన్నారు. బ్యాంకు అధికారులు కూడా పాల్గొన్నారు.