మాతృభూమి శ్రేయస్సు కోసం పనిచేసిన నిస్వార్థ శ్రామికులు పోలీసులు అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. వి. మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి అచ్చన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కలిసి పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.