గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి ప్రజలకే దక్కేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు. పల్లెపండుగ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం చెన్నూరు మండలంలోని కొండపేట గ్రామంలో సిమెం టు రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్తాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పల్లెల్లో నిత్యం పండుగ నెలకొనాలన్న సదుద్దేశ్యంతో కోట్లాది రూపాయలను ప్రభుత్వం అందిస్తోందన్నారు.
ఈ ప్రభుత్వం మహిళాభి వృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. వల్లూరు: పెద్దలేబాక పంచాయతీలోని చిన్ననాగిరెడ్డిపల్లెలో సీసీ రోడ్డు, గోకులం షెడ్డు నిర్మాణానికి శంకుస్థాన చేశారు. టీడీపీ మం డల నాయకుడు నాగేశ్వర్రెడ్డి మాజీ సర్పంచ శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.