కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఢిల్లీలోని ఆయన నివాసంలో ఆదివారం మంత్రి నారా లోకేశ్ కలిశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశాల కోసం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. హోంమంత్రి అపాయింట్మెంట్ దొరకడంతో.. అమిత్‌షాతో లోకేష్ సమావేశమయ్యారు.
రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధిని, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో మరింత కేంద్రం సాయం అందించాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనకు అమిత్‌షా సానుకూలంగా స్పందించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా కీలకస్థానంలో నిలబెట్టేందుకు అమిత్‌షా అందిస్తున్న సహకారం, రాష్ట్రం పట్ల ఆయన శ్రద్ధ గొప్పవి’’ అంటూ భేటీ అనంతరం లోకేష్ ట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.