రాజంపేట జనసేన పార్టీ కార్యాలయం లో మంగళవారం వైసిపి ఊటుకూరు సర్పంచ్ పల్లెపాగు ఈశ్వరయ్య , వైసిపి నాయకులు కొమ్మినేని సుబ్బరాయుడు, పంచాయితీ గ్రామాల 50 కుటుంబాలవారు జనసేన పార్లమెంట్ సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాస రాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊటుకూరు పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.