వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవ్‌కి డ్రాయర్, బనియన్ పార్సిల్ పంపిస్తున్నానని ఎద్దేవా చేశారు. ముందు ఒంటిమీద బట్టలు వేసుకుని గోరంట్ల మాధవ్ మాట్లాడితే బాగుంటుందని సెటైర్లు గుప్పించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని విమర్శించే హక్కు, స్థాయి మాధవ్‌కు లేదని ధ్వజమెత్తారు.
అదనంగా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు కాలం తీసుకున్న వ్యక్తి జగన్ అని చెప్పారు. సూపర్ సిక్స్‌పై విమర్శలు చేస్తున్న మాధవ్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని వర్మ వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌ను గ్రాండ్‌గా అమలు చేస్తుందని అన్నారు. అరగంట సమయం తీసుకునే వైసీపీ నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను విమర్శించే స్థాయి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తామని వర్మ తీవ్రంగా హెచ్చరించారు.