హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు చేయాలని తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బుధవారం అనంతపురం 2వ పట్టణ స్టేషన్లో సీఐకి ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీనరసింహ, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయుడు మాట్లాడుతూ. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితపై గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.