గ్రామాలలో అక్రమంగా నాటుసారా, మద్యం, గంజాయి అమ్మినా, సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చినమేరంగి ఎస్ఐ అనీస్ హెచ్చరించారు. బుధవారం జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామ సమీపంలో నాటుసారా తయారీ స్థావరంపై దాడి చేసి అక్రమంగా తయారు.
చేస్తున్న 400 లీటర్ల నాటుసారా బెల్లం ఊటను, అలాగే 20 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. నాటు సారా తయారీ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.