ధర్మవరం మండలంలోని ఫ్యాక్షన్ గ్రామాల్లో ఆదివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. మండలంలోని ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రముఖంగా ఉన్న ఓబుల నాయన పల్లి, తండా గ్రామాల్లో ధర్మవరం వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ రూరల్ సీఐ ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులతో మాట్లాడుతూ శాంతియుతంగా జీవించాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.