వేపాడ మండలం పాటురు గ్రామంలో 826 సంవత్సరాల పురాతన శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో సోమవారం రమా ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటలకు శ్రీ జనార్ధన స్వామివారికి పంచామృతాభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సింహద్వారం, గాలిగోపురం నిర్మాణం పూర్తయిందని ఉత్తర ద్వారం గాలిగోపురం నిర్మాణం నిమిత్తం విరాళాలు సేకరిస్తున్నట్లు అర్చకులు తెలిపారు.