రాష్ట్రంలో డిసెంబరు 9న తొలిసారిగా సీప్లేన్ సర్వీసులను ప్రారంభించనున్నట్టు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైౖలం వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తామని విశాఖలో ఆదివారం చెప్పారు. సీఎం చంద్రబాబు చేతులమీదుగా ఈ సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం రామ్మోహన్ ఎంతో కృషి చేశారు. సీప్లేన్ సర్వీసులు అందుబాటులోకి వస్తే అతి తక్కువ ఖర్చులో ఒకేరోజు రాష్ట్రంలోని విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయాలు దర్శించుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa