లిగొండ పూర్తయితే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, తాను అధికారంలోకి వస్తే ఏడాదిలోగా వెలుగొండ పూర్తి చేస్తానన్న జగన్ ఐదేళ్లపాటు ఏం చేశారని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా, పరిహారం ఇవ్వకుండా ప్రారంభోత్సవం చేసి జిల్లా ప్రజల్ని జగన్ మోసం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
2014 -19 లోనే మెజార్టీ పనులు పూర్తి చేశామని, జగన్ అధికారంలోకి వచ్చాక ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయని విమర్శించారు. ‘వెలిగొండ ప్రారంభించింది సీఎం చంద్రబాబు నాయుడే.. పూర్తి చేసేది చంద్రబాబు నాయుడే’ అని అన్నారు. త్వరితగతిన వెలిగొండ పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, ప్రకాశం జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.