మంత్రి నారాయణ చేతులమీదుగా గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు అవార్డ్, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పీఎం స్వానిధి ద్వారా 21, 594 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందించడం ద్వారా దేశంలో తొలి స్థానంలో గుంటూరు నిలిచింది. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ ని మంత్రి నారాయణ అభినందించారు.