పార్వతిపురం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. ఎమ్మెల్యే వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విధానాలు నచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో డా. భాను ప్రసాద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.