సోదరుడు జగన్‌తో ఆస్తుల వివాదం నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు భద్రతను పెంచాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు బుధవారం డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. షర్మిలకు ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్‌కు బదులు 4+4 గన్ మెన్‌ను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణలో షర్మిలకు వై కేటగిరీ సెక్యూరిటీని కల్పించారని, దానిని కొనసాగించాలని కూడా కాంగ్రెస్ నేతలు ఆ లేఖలో కోరారు. ఆమెకు వై కేటగిరీ భద్రతను ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగించాలని కోరారు. పార్టీ అధినాయకురాలిగా ఆమె చేసే ముఖ్యమైన కార్యక్రమాలకు భద్రత అవసరమని పేర్కొన్నారు.